మహేశ్   ట్విట్టర్ వేదికగా సూపర్ హిట్ సాంగ్ ప్రోమో రిలీజ్ 

వాస్తవం ప్రతినిధి: లుంగీ పైకి కట్టి .. తలకి పాగా చుట్టుకుని .. నాగలిని భుజాన పెట్టుకుని ఓ రైతులా మహేశ్ బాబు కనిపిస్తూ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ‘భరత్ అనే నేను’ థియేటర్లకు రానుంది. మహేశ్ అభిమానులంతా ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘వచ్చాడయ్యో సామి’ అనే సాంగ్ ప్రోమోను వదిలారు. మహేశ్ తన ట్విట్టర్ వేదికగా ఈ సాంగ్ ప్రోమోను వదలడం విశేషం. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో ఓ రైతులా మహేశ్ బాబు ఈ సాంగ్ కి ఎక్కువ మార్కులు పడటం విశేషం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. దేవిశ్రీ సంగీతం ఈ పాటని జనం నాల్కుల పై నిలబెట్టాయనే చెప్పాలి. సినిమా రిలీజ్ కి ముందు ఈ సూపర్ హిట్ సాంగ్ ప్రోమోను వదలడం మరింతగా కలిసొచ్చే అంశం. ఈ సినిమా ద్వారా కైరా అద్వాని కథానాయికగా పరిచయం కానుందనే సంగతి తెలిసిందే.