నేపాల్ లో భారత ఎంబసీ వద్ద పేలుడు!

వాస్తవం ప్రతినిధి: నేపాల్‌లోని భారత ఎంబసీ కార్యాలయం వద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. గత రాత్రి నేపాల్ బిరాట్‌నగర్‌లోని భారత ఎంబసీ కార్యాలయం వద్ద ఈ బాంబు పేలుడు సంభవించగా,కార్యాలయ గోడలు స్వల్పంగా ధ్వంసమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే ఈ పేలుడుకు గల కారణాలు, ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే నేపాల్ లో ఒక రాజకీయ పార్టీ సోమవారం బంద్ కి పిలుపు నిచ్చింది, అయితే ఇలాంటి సమయంలో ఈ విధంగా బాంబు పేలుడు సంభవించడం తో ఈ ఘటనలో స్థానిక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.