జోధ్ పూర్ సెషన్స్ కోర్టు లో సల్మాన్ కు ఊరట!

వాస్తవం ప్రతినిధి: కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఇటీవల జోధ్ పూర్ న్యాయస్థానం బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ఐదేళ్ల జైలు శిక్ష విదిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల పాటు జోధ్ పూర్ సెంట్రల్ జైల్లో గడిపిన సల్మాన్ ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఈ కేసు విషయంగా సల్మాన్ దేశం దాటి వెళ్ళకూడదు అంటూ షరతు విధించడం పై అప్పీలు చేయగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం సల్మాన్‌ ‘భారత్‌’, ‘కిక్‌ 2’, ‘దబాంగ్‌ 3’, ‘రేస్‌ 3’ చిత్రాల్లో నటించాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణలన్నీ విదేశాల్లో జరగాల్సి ఉండడం తో తనకు మూడు దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం సల్మాన్‌కు విదేశాల్లో చిత్రీకరణలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో సల్మాన్‌ మే 25 నుంచి జులై 10 వరకు కెనడా, నేపాల్‌, అమెరికాలో పర్యటించనున్నారు.