ఏపీ కికేంద్రప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: బోండా ఉమ 

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విరుచుకుపడ్డారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర పన్నుల వాటా కాకుండా ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామంటూ బీజేపీ నేతలు అబద్ధపు మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రకటనలు చేయడం తప్ప ఏపీకి ఇచ్చిందేమీ లేదని, ఇచ్చిన ప్రతి పైసాకు కేంద్రం లెక్కలు చూపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.