ఇప్పటివరకూ 6 వేలకు పైగా దేశ విదేశాల్లో స్టేజ్ షో లు చేశా:విజయలక్ష్మి

వాస్తవం సినిమా: తెలుగు సింగర్స్ లో విజయలక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని  సంపాదించుకున్నారు. ఒక వైపున సినిమాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరో వైపున స్టేజ్ షోల ద్వారా వీక్షకులను హూషారెత్తించారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ముచ్చటించారు.  ” అంతకు ముందు నేను కొన్ని సినిమాల్లో పాటలు పాడినా నాకు బాగా గుర్తింపు తెచ్చిన పాట .. ‘పిట్టలదొర’ చిత్రంలోని ‘రావే వయ్యారి రాస గుమ్మడి .. ఈ రాలుగాయి పిట్టల దొర నీ సరిజోడి’ అని చెప్పారు. ఇక రామ్ ‘దేవదాసు’ సినిమాలోని ‘మాయదారి సిన్నోడు .. మనసే లాగేసిండు’ అనే పాప్యులర్ పాటను కూడా విజయలక్ష్మి పాడినట్టు ఆలీ గుర్తు చేశారు. ఇక ఇంతవరకూ తాను దేశవిదేశాల్లో 6 వేల షోస్ చేశానని విజయలక్ష్మి అన్నారు. సినిమాల్లో పాడటం కన్నా స్టేజ్ షోలు చేయడం వల్లనే తాను ఎక్కువ పాప్యులర్ అయ్యానని ఆలీ ప్రశ్నకి సమాధానంగా ఆమె చెప్పారు.