సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇంటిపై కాల్పులు

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇంటిపై కాల్పులు చోటుచేసుకున్న ఘటన అక్కడ స్థానికంగా కలకలం రేగింది.  మాజీ ప్రధాని నవాజ్‌ షరీప్‌ అవినీతి కేసులను విచారిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై హత్యాయత్నం జరిగిన సంఘటన పాకిస్తాన్‌లో తీవ్ర కలకలంరేపింది. లాహోర్‌లోని మోడల్‌ టౌన్‌లో నివసిస్తోన్న జస్టిస్‌ ఇజాజ్‌ ఉల్‌ ఎహసాన్‌ ఇంటిపై ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదని అధికారులు తెలిపారు. జస్టిస్‌ ఎహసాన్‌.. నవాజ్‌తోపాటు ఆయన కుటుంబీకులపై నమోదైన కేసులను విచారిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే తుది తీర్పు వెలువడనున్న ఈ సమయంలో ఏకంగా జడ్డి పైనే హత్యాయత్నం జరగడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుసుకున్న వెంటనే పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి షకీబ్‌ నిసార్‌.. కాల్పులు జరిగిన జడ్జి ఇంటికి వచ్చి పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన‌.. దీని వెనకున్న కారణాలను కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తుంది.