మూడు రోజుల పాటు అమేధీ,రారుబరేలి లో పర్యటించనున్న రాహుల్

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నియోజకవర్గాలు అయిన అమేథి, రారుబరేలిలో మూడురోజుల పర్యటనను నిర్వహిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఆయన తొలుత రెండు రోజుల పాటు అమేధీ లో పర్యటించి మూడో రోజు రారుబరేలి లో పర్యటించనున్నట్లు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కాంగ్రెస్ తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. రైతులే లక్ష్యంగా రాహుల్ ఈ పర్యటనను నిర్వహించనున్నారు.  ఈ నేపధ్యంలోనే ఈ పర్యటనలో భాగంగా షుల్‌ బజార్‌లో జైనాభాగంజ్‌ మండిలో రైతులతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే పర్యటనల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగా పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన ఆధ్వర్యంలో నిర్మించిన థౌరి-కోటవా రహదారిని ప్రారంభించనున్నారు.