మరోసారి అభిమానుల మనసు దోచిన ప్రియా వారియర్

వాస్తవం సినిమా:ఒక్క కనుసైగతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారి, దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్, తాజాగా చీరకట్టుకుని ఫొటో దిగి ఫిదా చేసేస్తోంది. ఇటీవలి కాలంలో తన అభిమానులకు దగ్గరగా ఉండేందుకు పలు అంశాలను షేర్ చేసుకుంటున్న ప్రియ, మలయాళ న్యూ ఇయర్ ‘విషూ’ సందర్భంగా చీరకట్టులో మెరిసిపోయింది. అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ తన ఓ దీపాన్ని పట్టుకుని కనిపించింది. క్రీమ్ కలర్ లో ఆకుపచ్చని వర్క్, ఎరుపు రంగు బార్డర్ తో సంప్రదాయం ఉట్టిపడేలా ప్రియ కనిపిస్తుండగా, నుదుటన పెట్టుకున్న ఎర్రని బొట్టు ఆమె అందాన్ని మరింతగా పెంచేసిందంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.