చెన్నై సూపర్ కింగ్స్ కు తొలి ఓటమి

వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్‌ ఈ సీజన్ ప్రారంభమైన తరువాత చెన్నై సూపర్‌కింగ్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తో ఆడిన చెన్నై ఈ సీజన్ తోలి ఓటమి ని ఎదుర్కొంది. ఆదివారం మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 197 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (63; 33 బంతుల్లో 7×4, 4×6) చెలరేగాడు. ఛేదనలో పంజాబ్‌ బౌలర్లు క్రమశిక్షణగా బంతులేయడంతో చెన్నై 5 వికెట్లకు 193 పరుగులే చేయగలిగింది. ధోని మెరిసినా చెన్నైకు ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు.