చండీఘడ్ లో కథువా ఘటన విచారణ

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ లోని కథువా లో ఎనిమిదేళ్ళ బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి,హత్య చేసిన ఘటన పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ కేసు విచారణను జమ్ముకాశ్మీర్‌ నుంచి చండీగఢ్‌కు తరలించాలని కోరుతూ కథువా అత్యాచార బాధితురాలి తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అంగీకరించారు. ఈ కేసు విచారణ జమ్ముకశ్మీర్‌లో చేపడితే కేసును ప్రభావితం చేస్తారని అందుకే చండీ ఘడ్ కి తరలించాలని అత్యాచార భాదితురాలి తండ్రి కోరడం తో కోర్టు అంగీకరించింది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు దానిపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసును  సీబీఐకి అప్పగించాలని, జమ్ముకశ్మీర్‌ నుంచి కేసును బదిలీ చేయాలని ఢిల్లీ కి చెందిన ఓ న్యాయవాది కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. మరోపక్క కథువా బాధితురాలి కుటుంబ తరఫున వాదిస్తున్న  న్యాయవాది దీపీక‌సింగ్‌ రాజవత్‌ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తున్నారు.