కార్మిక చట్టాలపై మార్పులు చేసిన మాక్రాన్….ఆందోళన

వాస్తవం ప్రతినిధి: ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ అధికారంలోకి వచ్చాక నిదానంగా ఆయనపై ఆదరణ తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన తాజాగా కార్మిక చట్టాలలో మార్పులు చేశారు. అయితే కార్మిక చట్టాలలో మార్పులు చేయటాన్ని నిరసిస్తూ ప్రదర్సనలు చేపట్టగా అవి కొంచం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో తొమ్మిది మంది పోలీసులకు గాయాలు కాగా,ఈ ఘటనకు సంబంధించి 63 మందిని అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనల్లో భాగంగా  ప్రభుత్వ, ప్రజల ఆస్తులు ధ్వంసం అవ్వడం తో ఫ్రెంచ్ హోం మంత్రి గెరార్డ్ కోలాంబ్ తీవ్రంగా ఖండించారు. నిరసన ప్రదర్శనలు శాంతి యుతంగా నిర్వహించాలని, హింసకు పాల్పడ వద్దని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.