మోడీపై మండిపడ్డ గల్లా!

వాస్తవం ప్రతినిధి: ఈ మధ్యన ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని.. ఆర్థికమంత్రి జైట్లీని ఉద్దేశించి తీవ్ర స్వరంతో చేసిన మాటలు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.తాజాగా ఎంపీ జయదేవ్ మరోసారి మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదని.. ఆయన ప్రధాని కుర్చీలో కూర్చునే ఛాన్స్ లేదన్నారు. రైతుల్ని.. పేదల్ని.. ఎస్సీ..ఎస్టీలను మోడీ ప్రభుత్వం వ్యతిరేకమని దుయ్యబట్టారు. మోడీ సంగతి చెబుతున్న గల్లా.. ఏపీలో నెలకొన్న పరిస్థితులు.. బాబు సర్కారుపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై కూడా రియాక్ట్ అయితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.