‘మహానటి’ టీజర్ రిలీజ్

వాస్తవం సినిమా:తెలుగు తెరపై నవరస నట నాయకిగా సావిత్రి తిరుగులేని కెరియర్ ను కొనసాగించారు. నట శిఖరాలుగా ప్రశంసలు అందుకున్న ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఎస్వీఆర్ .. వంటివారితో కలిసి ఆమె పండించిన పాత్రలు ఈనాటికీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంటూనే వున్నాయి .. ఈ తరం వారిని సైతం ఆమె అభిమానులుగా మార్చేస్తూనే వున్నాయి. అలాంటి సావిత్రి జీవితం ‘మహానటి’ పేరుతో చిత్ర రూపాన్ని పొందింది.నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ‘అనగనగా ఒక మహానటి’ అంటూ ప్రారంభమవుతోన్న ఈ టీజర్‌ అలరిస్తోంది. సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
ఇక టీజర్ విషయానికొస్తే అనగనగా ఒక మహానటి అంటూ ఒత్తి ఒత్తి పలుకుతూ ఒక వాయిస్ ఓవర్ విన్పిస్తుండగా సమంతా ఎవరినో ఆశ్చర్యంతో చూస్తున్నట్టు చూపించి విజయ్ దేవరకొండ తన కొలీగ్ గా ఏదో చెప్పబోతున్నట్టు ఒక షాట్ లో చూపించారు. బహుశా ఇది మధురవాణి పాత్రలో జర్నలిస్ట్ గా నటించిన సమంతా సావిత్రి గారి ఆత్మకథను మనకు చెబుతూ టైపు చేయటం కాబోలు టీజర్ బిగినింగ్ అలాగే ఉంది. ఇక సావిత్రి గారిలా కీర్తి సురేష్ ని పరకాయ ప్రవేశం చేయించాడు నాగ అశ్విన్. తన పాత సినిమాలలోని కొన్ని బిట్స్ ని యధాతధంగా తీసిన అశ్విన్ సావిత్రి గారిని రీ క్రియేట్ చేసినట్టే ఉంది.