‘నా పేరు సూర్య ‘ ఆడియో వేడుక ‘మిలటరీ మాధవరం’ గ్రామంలో.. ఎందుకో తెలుసా?

వాస్తవం సినిమా: వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ సినిమా రూపొందింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, త్వరలో ఆడియో వేడుకను జరుపుకోనుంది. ఈ వేడుకను పశ్చిమ గోదావరి జిల్లా .. తాడేపల్లి గూడెం సమీపంలోని ‘మిలటరీ మాధవరం’ లో జరపాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే.. ఈ ఊళ్లో ఒక్కో కుటుంబం నుంచి ఒకరు ఆర్మీలో ఉన్నారు. ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ కనుక, ఆ గ్రామానికి వెళ్లి మిలటరీ కుటుంబాలను కలవాలనుకున్నారు.ఆ గ్రామస్తుల సమక్షంలోనే ఆడియో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం. అతి త్వరలో ఆ డేట్ ను ఫిక్స్ చేయనున్నారు. ఇక ఈ నెల 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించుకున్నారు. గచ్చిబౌలి ..యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ .. ఎల్బీ స్టేడియం .. ఈ మూడు ప్రదేశాల్లో ఎక్కడ జరపాలనేది కూడా త్వరలో ఖరారు చేయనున్నారు. మే 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.