డ్రోన్ ని తయారు చేసిన 13 ఏళ్ల కుర్రాడు

వాస్తవం ప్రతినిధి: 13 ఏళ్ల వయసు లో ఒక బాలుడు డ్రోన్ ను తయారు చేశాడు. దీనితో  డ్రోన్‌ను రూపొందించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న ఆ బాలుడు ఇప్పుడు గిన్నిస్‌ బుక్‌లో పేరు నమోదు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. లుథియానాకు చెందిన ఆర్యమన్‌ వర్మ అనే బాలుడికి చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలపై మక్కువ ఎక్కువ. ఈ నేపధ్యంలోనే గాలిలో ఎగిరే డ్రోన్‌లను చూసి తాను అలాంటిదే రూపొందించాలనుకున్నాడు. దానికి సంబందించిన సాంకేతిక కోసం తెలుసుకొని నాలుగు రోటర్ల తో నియంత్రించే క్వాడ్ కాప్టర్ ని తయారు చేసాడు. 70 అడుగుల ఎత్తువరకు ఎగురుతుందట. చిన్న వయస్సులోనే ఈ బాలుడు చూపించిన ప్రతిభ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇప్పుడు ఈ చిన్నారి పేరును ప్రపంచ రికార్డ్స్‌లోకి నమోదు చేయించేందుకు తల్లిదండ్రులు అతని పేరును గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు పంపారు. తమ కుమారుడి ప్రతిభ గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంటుందని అతని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.