గోల్డ్ మెడలిస్ట్ పై రాళ్ల దాడి

వాస్తవం ప్రతినిధి:  కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్‌పై దాడి జరిగింది. ఇటుకలు, రాళ్లతో ఆమెపై గుర్తు  తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తుంది. తమ బంధువును కలవడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పూనమ్‌తోపాటు తండ్రి, మరో ఇద్దరు బంధువులు కూడా ఉన్నారు. వాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపైన కూడా దాడి చేశారు. రాళ్ల వర్షం కురవడంతో ఆమెకు రక్షణగా ఉన్న పోలీసులు వెంటనే పూనమ్‌కు అక్కడి నుంచి తరలించారు. అయితే ఎవరు ఎందుకు ఆమెపై దాడి చేశారు అనే దానిపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.