గుజరాత్ లో ఘోర ప్రమాదం…..9 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సహాయక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకొని హుటా హుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన లో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.