గగనతలం లోనే ఇంధనం నింపే ప్రక్రియ

వాస్తవం ప్రతినిధి: గగన తలంలోనే యుద్ద విమానాలకు ఇంధనం నింపే ప్రక్రియను మరోసారి భారత వాయుసేన విజయవంతంగా పూర్తి చేసింది. యుద్ధం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు యుద్ధ విమానం కిందకు దిగ కుండానే ఇంధనం నింపే విమానాలను వాయుసేన ఇదివరకే సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే దానికి సంబందించిన ప్రక్రియను గగన తలంలోనే పూర్తి చేసి భారత్ మరోసారి తన సత్తా చాటుకుంది.