క‌థువా ఘటనపై స్పందించిన ఐరాస

వాస్తవం ప్రతినిధి:క‌థువా సామూహిక అత్యాచార ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా… ఈ దారుణం ప్ర‌పంచ దేశాల్లోనూ చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. ప‌లు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు క‌థువా దారుణానికి సంబంధించిన వార్త‌లను ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి. ఈ నేప‌థ్యంలో ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా స్పందించింది. ఎనిమిదేళ్ల చిన్నారికి మ‌త్తు ప‌దార్థాలు ఎక్కించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి అనంత‌రం ఆమెను హ‌త్య చేసిన ఘ‌ట‌న‌ను అత్యంత భ‌యంక‌ర‌మైన‌దిగా ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర‌స్ అభివ‌ర్ణించారు. భార‌త అధికారులు ఈ దారుణ ఘ‌ట‌న‌లో న్యాయం చేస్తార‌ని ఆశిస్తున్నాన‌ని గుటెర‌స్ త‌ర‌పున ఆయ‌న అధికార ప్ర‌తినిధి స్టీఫెన్ డుజారిక్ వ్యాఖ్యానించారు. బాలిక ప‌ట్ల పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తించిన మృగాళ్ల‌ను శిక్షించాల‌ని కోరారు.