ఏపీ సి ఎం కి మరోసారి లేఖ రాసిన ముద్రగడ

వాస్తవం ప్రతినిధి: ఏపీ  సిఎం చంద్రబాబునాయుడు కాపు జాతికి తీరని అన్యాయం చేస్తున్నారు అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఆయన మరోసారి ఏపీ సి ఎం లేఖ రాసినట్లు తెలుస్తుంది. అనంతరం మీడియా తో మాట్లాడిన ఆయన….జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలను వీడి రాజకీయాల్లో ఉంటేనే రాణిస్తారని తమ ఇంటికి వచ్చిన ఆ పార్టీ నాయకులూ రాఘవయ్యకు సూచించాను తప్ప పార్టీ లో చేరతానని చెప్పలేదని ముద్రగడ స్పష్టం చేశారు. అయినా కాపులకు ఎవరు న్యాయం చేస్తారో వారికే రానున్న ఎన్నికల్లో తమ మద్దతు వుంటుందని ముద్రగడ ఈ సందర్భంగా పేర్కొన్నారు.