వచ్చే నెల 8 వ తేదీ వరకు పార్లమెంట్ సస్పెండ్  

వాస్తవం ప్రతినిధి: శ్రీలంక ప్రభుత్వం లో గత కొద్ది రోజులుగా రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రధాని పై అక్కడి విపక్ష కూటమి పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టగా అది కూడా వీగిపోయింది. అయితే ప్రధాని కి వ్యతిరేకంగా పాలన మంత్రులు 16 మంది ఓటు వేయడం తో  వారంతా కూడా రాజీనామా లు చేశారు. అయితే ఇప్పుడు శ్రీలంక పార్లమెంట్‌ను వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు సస్పెండ్ చేస్తున్నట్లు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన గురువారం అర్ధరాత్రి ప్రకటించారు. అధికార సంకీర్ణ కూటమిలో విభేదాల నేపథ్యంలో అధ్యక్షుడు మైత్రిపాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కార్యదర్శి అస్టిన్ ఫెర్నాండో మీడియాకు తెలిపారు. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలేమిటో చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించినట్లు తెలుస్తుంది.