దాడుల విషయంలో అమెరికాను హెచ్చరించిన రష్యా

వాస్తవం ప్రతినిధి: అమెరికా, రష్యా ల మధ్య మరోసారి యుద్ద వాతావరణం నెలకొనింది. సిరియాపై అమెరికా దళాల వైమానిక దాడుల నేపథ్యంలో సిరియా మిత్రపక్షమైన రష్యా,అమెరికా కు హెచ్చరికలు జారీ చేసింది. ఈ దాడులకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మరోసారి మమ్మల్నిబెదిరిస్తున్నారు. ఇలాంటి చర్యలకు తగిన పరిణామాలు ఎదర్కోక తప్పదని అమెరికాలో రష్యా రాయబారి ఆంటోలీ ఆంటోనోవ్‌ హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడిని అవమానిస్తే ఏమాత్రం అంగీకరించబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సిరియా అధ్యక్షుడు అసద్‌కు పుతిన్‌ సహకరిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. ట్రంప్ హెచ్చరించినట్లు గానే సిరియా పై దాడులకు దిగడం తో రష్యా స్పందించింది.