టీ పిపి ఒప్పందం పై పునఃపరిశీలిస్తున్న అగ్రరాజ్యం

వాస్తవం ప్రతినిధి: ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (టిపిపి) వాణిజ్య ఒప్పందం నుండి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని పున:పరిశీ లించుకునేందుకు అమెరికా సిద్ధమైనట్లు ప్రకటించింది.  ఈ ఒప్పందం నుండి తమ దేశం వైదొలగుతున్నట్లు గత ఏడాది ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు ఇందులో పున్ణప్రవేశం పై చర్చలు జరపాల్సిందిగా లారీ కుడ్లో, దౌత్య వేత్త లితిజెర్‌ను ఆదేశించారని రిపబ్లికన్‌ సెనేటర్‌ బెన్‌ సాసె ఒక ప్రకటన ద్వారా వివరించారు. అయితే అధ్యక్ష భవనం దీనిపై ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు కానీ సెనేటర్ మాత్రం వెల్లడించారు. అంతకు ముందు గురువారం నాడు ఆయన ట్రంప్‌తో భేటీ అయి టిపిపి ఒప్పందంపై చర్చించినట్లు సమాచారం.