జాతీయ స్థాయి వికలాంగుల టీ20 టోర్నీని ప్రారంభించిన పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జాతీయ స్థాయి వికలాంగుల టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ టోర్నీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఆటగాళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ టోర్నీకి పవన్ కల్యాణ్ రూ. 5 లక్షల చెక్కును అందించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ తెలంగాణ, వడోదర జట్ల మధ్య జరగబోతోంది. జాతీయ స్థాయిలో ఈ టోర్నమెంట్ రెండోసారి జరుగుతోంది. ఈ పోటీలకు 24 రాష్ట్రాల నుంచి జట్లు హాజరయ్యాయి. టోర్నీ ప్రారంభోత్సవానికి హాజరైన పవన్ ను చూసి భారీ ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా స్టేడియంలో సీఎం, సీఎం అంటూ నినాదాలు కూడా వినిపించాయి.