చిట్టిబాబుని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: రామ్ చరణ్

వాస్తవం ప్రతినిధి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదలై బ్రహ్మాండమైన సక్సెస్‌ను అందుకోవడంతో శుక్రవారం నాడు ‘రంగస్థలం’ విజయోత్సవ సభను నిర్వహించింది చిత్ర యూనిట్.
హైదరాబాద్‌లో యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ‘రంగస్థలం విజయోత్సవ సభ’కు పవన్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు రామ్ చరణ్. ఆయన మాట్లాడుతూ.. మా బాబాయ్ ఎదురుగా ఉండే సరికి నా మాటలు వెనక్కి వెళిపోతున్నాయి. చాలా మాట్లాడాలనుకున్నా.. కాని ఒక వైపు అభిమానులు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉండే సరికి మాటలు రావడం లేదన్నారు. రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబు పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆ క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌దే అన్నారు. చిట్టిబాబుని ఆదరించిన ప్రేక్షకులు ధన్యవాదాలు. ఈ సినిమా చూసి నన్ను ప్రశంసించినవాళ్లలో ముగ్గురి గురించి ప్రధానంగా చెప్పాలన్నారు. మొదటిగా మా అమ్మ, నాన్నలు ఈ సినిమా చూసి భావోద్వేగంతో నన్ను హద్దుకున్నారన్నారు. మా అమ్మ చాలా ఎమోషన్ అవుతూ.. నన్ను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. అంతకంటే పెద్ద ప్రశంస ఏముంటుంది నా జీవితంలో అనుకున్నా. ఇక మరో వ్యక్తి మా బాబాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘రంగస్థలం’ సినిమా గురించి విన్న తరువాత ఆయన ఇంటికి పిలిచారు. సినిమా చాలా బాగుందంటున్నారు అంటూ ప్రశంసించారు. ఎప్పుడు చూస్తారు బాబాయ్ ‘రంగస్థలం’. ఇంట్లో చూద్దాం అని అన్నా. ఇంత మంచి సినిమాని థియేటర్‌లో చూడాలి అంటూ తనతో కలిసి ‘రంగస్థలం’ సినిమా చూశారు. ఇది ఎప్పటికీ మరిచిపోలేదు. తొలిప్రేమ’ చిత్రం తరువాత బాబాయ్ థియేటర్‌లో చూసిన ‘రంగస్థలం’. ఈ చిత్రం చూసిన తరువాత అద్భుతంగా చేశావు అంటూ ఆయన ప్రశంసించిన విధానం ఎప్పటికీ మరిపోలేనన్నారు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్‌లకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు రామ్ చరణ్.