చరణ్ పాదుకా పధకాన్ని ప్రారంభించిన మోదీ

వాస్తవం ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం బీజాపూర్ పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన ఒక గిరిజన మహిళకు పాదరక్షలు బహుకరించారు. బీజాపూర్ పర్యటనలో భాగంగా మోదీ.. చరణ్ పాదుకా(పాదరక్షలు) పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ.. గిరిజన మహిళకు పాదరక్షకాలు అందించారు. ఈ సమయంలో సభలో చప్పట్లు మార్మోగాయి. అలానే ఆయుష్మాన్ భారత్ పథకం కింద తొలి వెల్‌నెస్ సెంటర్ నిర్మాణానికి, అలానే పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేసినట్లు తెలుస్తుంది.  ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. అంతేకాకుండా బీజాపూర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అందుకు తాను హామీ ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.