ఉత్తమ గాయకుడిగా ఏసుదాసుకు జాతీయ పురస్కారం

SONY DSC

 వాస్తవం సినిమా: తాజాగా ప్రకటించిన 65వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమగాయకుడి అవార్డును కేజే ఏసుదాసు సొంతం చేసుకున్నారు. ‘విశ్వాసపూర్వం మన్సూర్‌’ అనే మలయాళ సినిమాలోని ‘పోయి మరాంజకాలం’ అనే పాటకు గాను ఆయన పురస్కారానికి ఎంపికయ్యారు. ఎనిమిదోసారి జాతీయ అవార్డు పొందడం ద్వారా ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు. గతంలో ఆయన 1972, 1973, 76, 82, 87, 91, 93 సంవత్సరాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు.