సమాజం కోసం పాటుపడుతున్న వ్యక్తి ప్రకాష్ రాజ్ : కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: సినీ నటుడు ప్రకాష్ రాజ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు మధ్యాహ్నం బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం, మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రకాష్ రాజ్ ‘హీరో’ అని ప్రశంసించారు. ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసని, సమాజం కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నానని కేసీఆర్ అన్నారు. కాగా, సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, శేఖర్ రెడ్డిలతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు.