‘రంగస్థలం’ .. ఇతర భాషల్లోకి అనువాదం

వాస్తవం సినిమా: చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ .. తెలుగులో భారీ వసూళ్లను సాధిస్తూ తన జోరును కొనసాగిస్తోంది. దాంతో ప్రతి ప్రాంతంలోను మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 103 కోట్ల షేర్ ను సాధించింది. తెలుగులో అత్యంత వేగంగా .. అత్యధికంగా వసూళ్లను రాబట్టిన 3వ చిత్రంగా నిలిచింది. ఇలాంటి సినిమాను ఎలాగూ రీమేక్ చేయడం సాధ్యం కాదు కాబట్టి… దీన్ని ఇతర భాషల్లోకి అనువదించే ప్రక్రియ మొదలుకానున్నదని తెలుస్తోంది.
ఇది వరకూ రామ్ చరణ్ సినిమాలు, సుకుమార్ సినిమాలు పక్క భాషల్లోకి అనువాదం అయిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో రంగస్థలం డబ్బింగ్ వెర్షన్లు కూడా ఆసక్తిదాయకమే. రంగస్థలం సినిమాను ప్రధానంగా తమిళంలోకి, హిందీలోకి, మలయాళంలోకి అనువాదించాలనే ప్రణాళిక ఉన్నట్టుగా తెలుస్తోంది.