మైదానం లోపల బయటా ఆయనే నా హిరో : కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: భారత మాజీ క్రికెటర్ రికార్డుల రారాజు సచిన్ తెండూల్కర్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఆయన అంటే అభిమానం, అయితే తాజాగా భారత సారధి విరాట్ కోహ్లీ కు కూడా సచిన్ అంటేనే ఇష్టం అట. బెంగుళూరు లోని ఒక కార్యక్రమానికి హాజరైన కోహ్లీ ని పలువురు అభిమానులు పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ సందర్భంగా మైదానం లోపల బయట మీ అభిమాన హిరో ఎవరు అని ప్రశ్నించగా వెంటనే సమాధానం గా ఏమాత్రం ఆలోచించకుండా సచిన్ తెండుల్కర్ అంటూ టక్కున సమాధానం ఇచ్చారు.  దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. మరొకరు వారాంతంలో ఏం చేస్తుంటారు అని ప్రశ్నించగా.. ‘వారాంతంలో సరదాగా గడిపేందుకు నాకు అవకాశం దొరకదు. ఒకవేళ దొరికితే ఇంట్లో ఉండి రిలాక్స్‌ అయ్యేందుకే ప్రయత్నిస్తా. లేదంటే నా ఫేవరేట్‌ కారులో మ్యూజిక్‌ వింటూ డ్రైవింగ్‌ చేస్తా’ అని చెప్పుకొచ్చాడు కోహ్లీ. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన బెంగళూరు తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.