ఇంటర్ ఫెయిల్ విద్యార్ధి ఆత్మహత్య…మరొకరు ఆత్మహత్యాయత్నం

వాస్తవం ప్రతినిధి: ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలై కొద్ది గంటలు గడువక ముందే యువత ఆత్మహత్య కు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి సమీపంలోని కైతల్లాపూర్‌కు చెందిన కట్రాజ్ కిరణ్(16) అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్థాపం చెందిన కిరణ్ ఈ రోజు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోపక్క  వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన సూదిరెడ్డి అనే స్టూడెంట్ ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే అతడి పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.