ఆ ఘటన పై తీవ్ర కలత చెందాను: మేనకగాంధీ

వాస్తవం ప్రతినిధి: జమ్ము కాశ్మీర్‌లో కతువాలోని ఎనిమిది సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అని కేంద్ర మంత్రి మేనక గాంధీ వీడియో ద్వారా తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చిన్నారులపై జరుగతున్న లైంగిక దాడులకు వ్యతిరేక రక్షణ చట్టం(ఫ్కోసో) ను సవరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో ఆ చట్టాన్ని సవరించాలసిన నోట్ ను కేబినేట్ ముందులు తీసుకెళుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ వీడియోలో కతురాలో జరిగిన ఘటనతో పాటు ఇటీవల కాలంలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో తానెంతో కలత చెందానని అన్నారు. 12 ఏళ్ళలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే నిందితులకు మరణ శిక్షను విధించే విధంగా ప్కోసో చట్టాన్ని సవరణ తీసుకురావాలని మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుందని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో మంత్రి తెలిపారు.