అరుదైన ఘనత సాదించిన రషీద్ ఖాన్

వాస్తవం ప్రతినిధి:  ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్ ఖాన్‌ చాలా అరుదైన ఘనతను సాధించాడు. టోర్నీలో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  నాలుగు ఓవర్లు వేసిన రషీద్‌ ఖాన్ 13 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీయడమే కాకుండా 18 డాట్స్ బాల్స్ వేసి ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన‌ మూడో ఆటగాడిగా  నిలిచిపోయాడు.  అంతకుముందు రవిచంద్రన్‌ అశ్విన్‌, అమిత్‌ మిశ్రా చెరో మ్యాచ్‌లో అత్యధికంగా 18 డాట్‌ బాల్స్‌ వేశారు. అశ్విన్‌ ఈ ఘనతను రెండుసార్లు సాధించగా, గురువారం ముంబాయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ కూడా 18 డాట్ బాల్స్ వేసి ఈ ఘటన సాదించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు రషీద్‌ ఖాన్‌కే దక్కింది.