257 మంది సైనికులు మృతి!

వాస్తవం ప్రతినిధి: అల్జీరియాలో సైనిక సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనలో 257మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం.  బౌఫారిక్ వైమానిక స్థావరం నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ సైనిక విమానం కుప్పకూలింది. దీనితో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 25౭మన్ది సైనికులు మృత్యువాత పడ్డారు. రాజధాని అల్జీర్స్‌కు 25కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌఫారిక్ ఎయిర్‌బేస్‌ను ఆర్మీ ప్రస్తుతం సైనికఅవసరాల కోసం వాడుకుంటున్నది. వివిధ ప్రాంతాలకు సైన్యాన్ని ఇక్కడినుంచి తరలిస్తూ ఉంటారు. ఆ క్రమంలో బుధవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో ఇల్యూషిన్-76 సైనిక రవాణా విమానం అల్జీరియా- పశ్చిమ సహారా సరిహద్దుల్లోని టిండాఫ్ పట్టణానికి బయల్దేరింది. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే కుప్పకూలిపోవడం తో దానిలో ప్రయాణిస్తున్న 257 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. తొలుత 100 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు 257 మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా స్పష్టం చేసింది. 300మంది అత్యవసర సేవల సిబ్బంది, భద్రతాసిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.