భారీస్థాయిలో సక్సెస్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్న సుకుమార్

వాస్తవం సినిమా: ఫారిన్ నేపథ్యంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసిన సుకుమార్ .. ఎన్టీఆర్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక గ్రామీణ నేపథ్యంలో ‘రంగస్థలం’ సినిమా చేసి చరణ్ కి కూడా అనూహ్యమైన విజయాన్ని అప్పగించాడు. ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ సినిమాకి అన్ని ప్రాంతాల ప్రేక్షకులు పట్టంకట్టారు. కథాకథనాల పరంగాను . . పాత్రలను తీర్చిదిద్దిన విధానంలోను ఈ సినిమా అదుర్స్ అంటూ నీరాజనాలు పడుతున్నారు.అలాంటి ప్రేక్షకులతో కలిసి విజయోత్సాహాన్ని జరుపుకునేందుకు భారీస్థాయిలో సక్సెస్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అయితే ఈ వేడుకను ఎక్కడ .. ఎప్పుడు జరపనున్నారనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ – యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను జరపనున్నారనేది తాజా సమాచారం. ఈ వేడుకకి చిరంజీవి .. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటం విశేషం.