బెంగుళూరు వెళ్లనున్న కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంతో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రేపు బెంగళూరు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. రేపు ఉదయం 9.45 కు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవగౌడతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కి చేరుకుంటారు.  దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు ప్రక్రియ దిశగా ఇటీవల కేసీఆర్‌ కోల్‌కతా వెళ్లి పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించారు. ఆ తర్వాత ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తాజాగా కేసీఆర్‌ ఇప్పుడు బెంగుళూరు ప్రయాణమవ్వడం అంతేకాకుండా అక్కడ మాజీ ప్రధాని దేవగౌడ తో సమావేశం కావడం వంటి విషయాలపై ఇప్పుడు రాజకీయంగా చర్చ ప్రారంభమైంది.