పరమ శివుడి అవతారంలో ఇమ్రాన్ ఖాన్!

వాస్తవం ప్రతినిధి: శివుడి అవతారంలో ఇమ్రాన్ ఖాన్ కనిపించాడు. ఇమ్రాన్ ఖాన్ ఏంటి పరమ శివుడి అవతారంలో కనిపించడం ఏంటి అని అనుకుంటున్నారా.  పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీకి ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌ను ఓ హిందూ దేవుడి రూపంలో చిత్రించడం ఇప్పుడా దేశంలో పెను దుమారం రేపుతున్నది. ఈ అంశాన్ని అక్కడి హిందూ చట్టసభ ప్రతినిధులు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఫొటోను సృష్టించిన వ్యక్తిని పట్టుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ఫొటోను వాడుకొని సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చెందుతున్నాయని హిందూ ఎంపీలు నేషనల్ అసెంబ్లీలో నిరసన తెలిపడం తో అక్కడి ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది.