తండ్రి పాట‌ను రీమేక్ చేస్తున్న తనయుడు

వాస్తవం సినిమా: తెలుగు సినిమాల‌లో హీరోల కొడుకులు స‌హ‌జంగానే వారి వారసత్వం తీసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.ఇప్పుడు హీరోలు తండ్రుల వారసత్వంతో పాటు వారి పాట‌ల‌ను కూడా వారసత్వంగా తీసుకుంటున్నారు.ఇప్పుడు ఇదే కోవలో నాగచైతన్య కూడా ఓ సాంగ్ చేయబొతున్నాడు. సీనియర్ హీరో నాగార్జున చేసిన హిట్ సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నారు. సక్సెస్ ఫుల్ డైరక్టర్ చందు మొండేటి, సక్సెస్ ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీస్ కలిసి అందిస్తున్న సవ్యసాచి సినిమా కోసం నాగ్ అలనాటి సూపర్ హిట్..’నిన్ను రోడ్ మీద చూసినది లగాయత్తు’ అన్న పాటను రీమిక్స్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ చిన్న గమ్మత్తు ఏమిటంటే, అప్పట్లో ఆ పాటను అందించిన కీరవాణినే ఇప్పుడు మళ్లీ రీమిక్స్ చేయడం విశేషం.ఈ సాంగ్‌లో యాక్ట్ చేయ‌డానికి ర‌కుల్‌ని కాని కాజ‌ల్‌ని అని అనుకుంటున్నార‌ని స‌మాచారం.