మే 11వ తేదీన వస్తున్న ‘మెహబూబా’   

వాస్తవం సినిమా: పూరీ జగన్నాథ్ .. తన తనయుడు ఆకాశ్ హీరోగా ‘మెహబూబా’ సినిమా చేశాడు. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథాంశంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కు .. టీజర్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్ని గంటల క్రితం  ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ద్వారా పూరీ సింపుల్ గా కథ చెప్పేశాడు. ఇది ఒక సైనికుడి ప్రేమకథగా, యుద్ధం .. ప్రేమకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.”దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక్క సైనికుడికే ఉంటుంది .. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలు”. “అసలు ఈ సరిహద్దులనేవి లేకుంటే ఎంత బాగుండేది”. “మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం .. మళ్లీ మళ్లీ పుడతాం” అంటూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. మే 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.