కేదార్ స్థానం లో డేవిడ్ కెల్లీ 

వాస్తవం ప్రతినిధి: రెండేళ్ళ నిషేధం తరువాత తిరిగి ఐపీఎల్ లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జట్టు లో  మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కేదార్‌ జాదవ్‌ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం వెల్లడించింది. ఈ నేపధ్యంలో అతని స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ విల్లీ ని తీసుకున్నట్లు ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ పీటర్‌ విల్లీ కుమారుడే డేవిడ్‌.
ఈ ఏడాది ఐపీఎల్‌లో అనేక కారణాల వల్ల కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. బాల్ టాంపరింగ్‌ ఉదంతం వల్ల స్మిత్‌, వార్నర్‌ ఈ సీజన్‌కు దూరం కాగా.. గాయాలతో మిచెల్‌ స్టార్క్‌, కాగిసో రబాడ టోర్నీలో ఆడలేకపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో కేదార్‌ జాదవ్‌, కమిన్స్‌ కూడా చేరారు. వీరిద్దరు కూడా గాయాల కారణంగానే టోర్నీకి దూరమయ్యారు.