అల్జీరియా లో ఘోర విమాన ప్రమాదం!

వాస్తవం ప్రతినిధి: అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వంద మంది సిబ్బందితో వెళ్తున్న మిలిటరీ విమానం బౌఫారిక్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కుప్పకూలిపోయినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం విషయంలో పూర్తి స్థాయి సమాచారం లేనప్పటికీ పెద్ద సంఖ్యలో మిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం సమయంలో  విమానంలో 200 మందికిపైగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమాచారం పై స్పష్టత రావాల్సి ఉంది. మరోపక్క ఈ ప్రమాదం జరిగిన వెంటనే 14 అంబులెన్స్‌లు హుటా హుటిన అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న అన్ని రోడ్లను మూసేశారు. బౌఫారిక్ మిలిటరీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాజధాని అల్జీర్స్‌కు దగ్గర్లో విమానం కూలింది. అల్జీరియా ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలో ఈ ఎయిర్‌పోర్ట్ ఉన్నట్లు తెలుస్తుంది.