అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ వద్ద 1600 మంది నేషనల్ గార్డ్ సభ్యులు

వాస్తవం ప్రతినిధి: అమెరికా- మెక్సికో సరిహద్దు వద్దకు ఇటీవల ఎక్కువ బలగాలను మొహరించాలి అంటూ అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో 1600మంది నేషనల్‌ గార్డ్‌ సభ్యు లను పంపేందుకు మూడు రాష్ట్రాల గవర్నర్లు అంగీ కరించినట్లు తెలుస్తుంది.  సరిహద్దు వద్ద వలసవాదుల రాకపోకలు, నేరాలు పెరుగుతున్నాయని, వాటిని అదుపు చేయడానికి బలగాలు అవసరమవుతాయని, ఆ మేరకు రాష్ట్రాలు బలగాలను పంపాలని అధ్యక్షుడు ట్రంప్‌ కోరడం తో మూడు రాష్ట్రాల గవర్నర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా అరిజోనా, న్యూ మెక్సికో, టెక్సాస్‌ రాష్ట్రాల గవర్నర్లు హామీ ఇచ్చారు. 4వేల మంది సైనికుల అవసరం వుంటుందని ట్రంప్‌ పేర్కొనగా దాదాపు సగం వరకు అంటే 1600మందిని పంపేందుకు అంగీకరించారు.