హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సెర్గీ కుమార్తె

వాస్తవం ప్రతినిధి: నర్వ్ ఏజెంట్ దాడి కేసులో తీవ్ర అస్వస్థతకు గురైన రష్యా గూఢాచారి సెర్గీ కూతురు యులియా స్క్రిపాల్ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది. సాలిస్‌బరీ డిస్ట్రిక్ హాస్పటల్ నుంచి 33 ఏళ్ల యులియా డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకేల్లినట్లు తెలుస్తుంది. అయితే ఆమెకు ఇంకా ఇవ్వ వలసిన ట్రీట్ మెంట్ ముగిలి ఉండదని, ఆమె ట్రీట్‌మెంట్ ముగిసిపోలేదని వాళ్లు చెప్పారు. యులియా తండ్రి సెర్గీ మాత్రం ఇంకా హాస్పటల్‌లోనే ఉన్నాడు. నోవిచోక్ నర్వ్ ఏజెంట్‌తో మార్చి 4వ తేదీన ఆ ఇద్దరిపై దాడి జరిగింది. సాలిస్‌బరీ పార్క్ బెంచ్‌పైనే పడి ఉండడంతో వాళ్లను హాస్పటల్‌కు తరలించారు.