షాలినీ పాండే కి బంపర్ ఆఫర్ ! 

వాస్తవం సినిమా: అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ బేబీ‌గా మారిన షాలిని పాండేకి ప్రిన్స్ మహేష్ బాబుతో నటించే బంపర్ ఆఫర్ తగిలినట్లు ఫిలిం నగర్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో షాలినీ పాండేకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. తొలి సినిమాతోనే అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాలో మెచ్యూరిటీ ఉన్న నటిగా మెప్పించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
త్వరలో మహేశ్‌బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. త్వరలో మహేశ్‌ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. కాగా ఇందులో ‘అర్జున్‌రెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక షాలిని పాండే నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథానాయికగా కాకుండా సినిమాలోని ఓ కీలక పాత్రలో ఆమె కనిపించే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.