మరోసారి తన టాలెంట్ నిరూపించుకొంటున్న అలియా భట్

వాస్తవం సినిమా: బాలీవుడ్‌లో అలియా భట్ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొంది. సినిమాల ఎంపిక, అద్భుత నటన ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇప్పుడు మరోసారి తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు అలియా భట్ సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాజి’. జంగ్లీ పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో నిర్మాతలు ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. దీనిలో భాగంగా నేడు (ఏప్రిల్ 10న) ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇప్పటికే విడుదలైన మూడు పోస్టర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ మూడు పోస్టర్లు సినిమాలో అలియా భట్ పాత్రను సూచన ప్రాయంగా చెప్పేశాయి. ఓ తండ్రికి కూతురుగా, ఓ భర్తకు భార్యగా, ఓ స్పైగా అలియా పోస్టర్లలో కనిపించింది. దీంతో సాధారణంగా ట్రైలర్‌పై సినీ ప్రేమికులకు ఆసక్తి పెరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. ప్రేక్షకుల ఎదురుచూపుకు ఈ ట్రైలర్ కచ్చితంగా న్యాయం చేసిందనే చెప్పాలి.