కామన్వెల్త్ గేమ్స్ లో షూటర్ల హవా

వాస్తవం ప్రతినిధి: గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు హవా కొనసాగుతుంది. షూటింగ్ విభాగంలో ఇవాళ ఇండియాకు మరో గోల్డ్ దక్కింది. మహిళల 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో షూటర్ హీనా సిధూ స్వర్ణ పతకం గెలుచుకుంది. దీంతో కామన్‌వెల్త్‌లో భారత్ గెలుచుకున్న బంగారు పతకాల సంఖ్య 11కు చేరుకున్నది. ఈ గేమ్స్‌లో హీనాకు ఇది రెండ‌వ మెడ‌ల్ కావ‌డం విశేషం. 10మీ ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో హీనాకు సిల్వ‌ర్ ప‌త‌కం ద‌క్కింది. ఇవాళ జ‌రిగిన 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఎలినా గ‌లియ‌బోవిచ్ రెండ‌వ స్థానంలో నిలిచింది. ఇక కాంస్య ప‌త‌కాన్ని మ‌లేషియాకు చెందిన అలియా స‌జానా అజ‌హ‌రి గెలుపొందింది.