ఈ నెల 15, 16తేదీల్లో అనంతపురంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మరోసారి అనంతపురంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో ఆయన అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటారు. పవన్ పర్యటనలో వామపక్ష నేతలు కూడా పాల్గొంటారు. అలాగే, అనంతపురంలో పలువురు నేతలతో కలిసి ఏర్పాటు చేయనున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోనూ పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అనంతపురం జిల్లాలోని తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా పవన్ కల్యాణ్ చర్చించి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.