అమెరికాలో  కూలిన విమానం

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో ఒక చిన్న విమానం మంటలతో గోల్ఫ్‌కోర్సులో కుప్పకూలిపోయింది. స్కాట్స్‌డేల్‌ ఆరిజోనా పోలీసులు ఈ ఘటనను ధ్రువీకరించారు. అయితే ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెంది ఉండొచ్చని, గాయాలతో ఎవరూ ఆ మైదానంలో కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే దూరం నుంచి ఒక ప్రత్యక్ష సాక్షి ఈ దృశ్యాన్ని‌ చిత్రీకరించి టిట్టర్‌లో వీడియో పోస్ట్‌ చేయడం తో  ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. స్కాట్స్‌డేల్‌ విమానాశ్రయం నుంచి ఈ ఆ చిన్న విమానం సోమవారం రాత్రి పైకి ఎగిరిన కొద్ది సేపట్లోనే మంటలతో టిపిసి స్కాట్స్‌డేల్‌ ఛాంపియన్స్‌ గోల్ఫ్‌ కోర్సులో కూలిపోయిందని అధికారులు తెలిపారు. మండుతున్న బంతిలా కప్పకూలుతున్న విమాన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఏమైందీ? అంటూ పలువురు తమకు ఫోన్స్‌ చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఇంతకీ ఆ చిన్న విమానంలో ఎవరున్నారు? అనే వివరాలు మాత్రం తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.