అపోలో ప్రతాప రెడ్డి కి సమన్లు

వాస్తవం ప్రతినిధి:తమిళనాడు దిగవంత ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడాదిన్నర కావస్తున్నా ఆమె మరణం మీద ఉన్న అనుమానాలు తీర లేదు. ఆమె మృతి పై నెలకొన్న సందేహాల్ని తీర్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్‌ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. జయలలిత మరణం వెనుకున్న మిస్టరీని సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు విచారణను వేగవంతం చేస్తూ, పలు కోణాల్లో ఎంక్వయిరీ సాగిస్తున్న కమిషన్, ఇప్పటికే, జయకు సన్నిహితంగా ఉండే పలువురి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. ఆమెకు తుది రోజుల్లో చికిత్స జరిపిన అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్‌ సీ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. విచారణకు రావాలని ఆదేశాలు ఇస్తూ, అందుకు వారం రోజుల సమయం ఇస్తూ, నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సమన్లకు అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున ఆసుపత్రి అధికారులు నివేదికను పంపగా, మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా విచారించేందుకు ప్రతాప్‌ సీ రెడ్డిని విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది.