హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది చిన్నారుల మృతి

వాస్తవం ప్రతినిధి: హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రా జిల్లా నుర్పుర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులను  ఇంటికి తీసుకెళుతున్న పాఠశాల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 20 మంది చిన్నారులు మృతి చెందగా, మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి.చిన్నారుల మృతితో వారి కుటుంబాలలో విషాద చాయలు నెలకొన్నాయి. . ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులంతా ఐదో తరగతిలోపు వారేనని పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం.. గాయాలపాలైన చిన్నారులను ఆసుపత్రికి తరలిస్తోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొని, ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు.